భారత్ న్యూస్ వరంగల్ …ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్!.. బావిలోకి దూసుకెళ్లిన థార్..ఒకరు మృతి
తెలంగాణ
ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ.. డ్రైవింగ్ చేస్తుండగా థార్ వెహికల్ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది.
ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లిలో జరిగింది.
నివేష్, అశ్విన్, అరుణ్ థార్ వాహనంలో మొబైల్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ ప్రయాణించారు.
ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.

డ్రైవింగ్ చేస్తున్న జగిత్యాలకు చెందిన అరుణ్ బావిలో మునిగి మృతి చెందగా.. నివేష్, అశ్విన్ సురక్షితంగా బయటపడ్డారు….