బాలాజీ రైల్వే డివిజన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష కైనాసిద్ధం

బాలాజీ రైల్వే డివిజన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష కైనా
సిద్ధం

భారత్ న్యూస్ (పాకాల) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బాలాజీ రైల్వే డివిజన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష కోసమైనా సిద్ధమేనని బాలాజీ డివిజన్ పోరాట కమిటీ సభ్యుడు సూరినేని బుజ్జి బాబు నాయుడు హెచ్చరించారు. దక్షిణ కోస్తా రైల్వే ని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం అలాగే పాకాల లో ఉన్న రైల్వేస్థలం ఉపయోగపడాలన్న, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే అలాగే పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభించాలన్న బాలాజీ డివిజన్ సాధించాలని స్పష్టం చేశారు. సోమవారం డివిజన్ ఏర్పాటు కోరుతూ పాకాల రైల్వే స్టేషన్ ఎదురుగా కొబ్బరికాయలు కొట్టి తమ డిమాండును వెలిబుచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు