నిమ్మగడ్డ లంకలో మట్టి తవ్వేందుకు రంగం సిద్ధం?

భారత్ న్యూస్ అనంతపురం..నిమ్మగడ్డ లంకలో మట్టి తవ్వేందుకు రంగం సిద్ధం?

ఈరోజు రాత్రి భారీ తవ్వకాలకు ముహూర్తం ఫిక్స్
చల్లపల్లి:
కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం నిమ్మగడ్డ లంక దిబ్బను తవ్వుకుని సొమ్ము చేసుకునేందుకు మట్టి మాఫియా నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రే భారీ తరలింపుకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. అడ్డుతగులుతారనుకున్న కొందరిని కలిసి లాలించి, బుజ్జగించి వారిని తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్న వైనం. పలు శాఖలకు చెందిన కొందరు అధికారులతో మాట్లాడామని, తాము అడ్డురామని యధేశ్చగా నిమ్మగడ్డ లంక నుంచి మట్టి తరలించుకోవచ్చని కొందరు అధికారులు భరోసా ఇచ్చారని మాఫియా వారు చెపుతున్నట్లు తెలిసింది. గ్రామస్థాయిలో విఆర్వో, మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్, ఆపైన మైనింగ్ ఇలా అనేక శాఖలకు చెందిన అధికారుల్లో ఎవరు వీరికి మట్టి తరలించుకోమని అనుమతి ఇచ్చారనేది తెలియదు. నడకుదురు, నిమ్మగడ్డ, ఆముదార్లంక, వెలివెలో ప్రాంతాలు సిఆర్జెడ్ పరిధిలో ఉన్నాయి. ఈప్రాంతాల్లో మట్టి, ఇసుక, బుసక తవ్వేందుకు ఆనుమతి లేదు. ఆలాంటప్పుడు మాఫియా వారికి సహకించి అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరో ఆ దేముడికే తెలియాలి.
ప్రస్తతం ఒక పొక్లెయిన్ ను తీసుకువచ్చి నిమ్మగడ్డ లంకలో పెట్టారు. ట్రాక్టర్లను కూడా మాట్లాడుకున్నట్లు తెలిసింది. శనివారం రాత్రికి భారీ స్థాయిలో మట్టి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అనుకున్న ప్రకారం నిమ్మగడ్డ లంకలో మట్టిని, బసకను మాఫియా వారు తవ్వుతారా… లేదా?, తవ్వితే సంబంధిత శాఖ అధికారులు తవ్వకాలను అడ్డుకుంటారా…. లేక ముందుగా చెప్పుకున్నట్లు చూసి చూడనట్లు వ్యవహరించి వదిలేస్తారా? అనేది వేచి చూడాలి.

శనివారం రాత్రి ట్రయల్ రన్