భారత్ న్యూస్ విశాఖపట్నం..ఎన్టీఆర్ ఆశయ సాధనే తెలుగుదేశం లక్ష్యం : కనపర్తి శ్రీనివాసరావు
స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసిన టీడీపీ నేతలు
సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించిన టీడీపీ నేతలు
కదంతొక్కిన అవనిగడ్డ 7వ క్లస్టర్ టీడీపీ శ్రేణులు

అవనిగడ్డ, మే 28: స్థానిక రెవెన్యూ హాల్ గురువారం పసుపు మయమైంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు డిజిటల్ వేడుకలు రెండో రోజు ఇక్కడ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. అవనిగడ్డ నియోజకవర్గ 7వ నంబర్ క్లస్టర్ పరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వర్చువల్ మహానాడులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ అధినేత సందేశాన్ని, మహానాడు తీర్మానాలను డిజిటల్ స్క్రీన్ల ద్వారా ఆసక్తిగా తిలకించారు.ఇదే వేదికపై తెలుగుజాతి గర్వించదగ్గ నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక సంచలనమని, రూపాయికి కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు వంటి విప్లవాత్మక పథకాలతో పేదల గుండెల్లో ఆయన శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు.
7వ నంబర్ క్లస్టర్ పరిధిలోని గ్రామ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో రెవెన్యూ హాల్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. పార్టీ సీనియర్ నాయకులు, యువత, మహిళా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మహానాడును విజయవంతం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని జనం చేరవేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని శ్రేణులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశాయి. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,అవనిగడ్డ క్లస్టర్ ఇంచార్జ్ బండే రాఘవ,కృష్ణాజిల్లా,పార్టీ సీనియర్ నాయకులు కొండవేటి మస్తాన్ రావు,మండలి రామమోహనరావు,అందే శివరామ కృష్ణ,మెగవత్తు గోపి,విశ్వనాథపల్లి పాప,ఉద్దండి రామారావు,నాగిడి శివ నాగేశ్వరరావు, రేపల్లె శ్రీ రామ చంద్రమూర్తి,మాలే వీర రాఘవయ్య,మాదివాడ రత్నారావు,భట్టు నరసింహారావు,అవనిగడ్డ మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ,పార్టీ నాయకులు దాసినేని శ్రీనివాసరావు,బొప్పన శేషారావు,కంచర్ల ఆనంద్,మెరుగు సోమిరెడ్డి,కమ్మిలి సుబ్రహ్మణ్యం,కొండవీటి మధు,కమ్మిలి రమేష్,ఘంటసాల రాజమోహనరావు,అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ,గుంటూరు వినయ్,నాగిడి రాంబాబు,మైల హరిబాబు,రేపల్లె నాగబాబు,ముళ్ళపూడి శ్రీనివాసరావు,కొండవీటి గోవిందు,నలుకుర్తి రాము తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు