అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు గారిపై సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు గారిపై సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

💥 శునకానందం ఆపండి: పరిశీలకుడు మారుతున్నారంటూ పుకార్లు పుట్టించి కొందరు శునకానందం పొందటం సిగ్గుచేటు. మీ పిరికిపంద చర్యలు పార్టీ కేడర్ దగ్గర సాగవు.

💥 95% మంది మద్దతు ఆయనకే: నియోజకవర్గంలో 95 శాతం మంది నాయకులు, కార్యకర్తలు కనపర్తి శ్రీనివాసరావు గారి పనితీరుపట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాతే పార్టీలో నూతన ఉత్సాహం వచ్చింది, ఈ విషయం పసిపిల్లవాడిని అడిగినా చెప్తారు.

💥 పార్టీని బ్రష్టు పట్టించొద్దు: సమస్య ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలి తప్ప, ఇలా చాటుగా తప్పుడు పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోం. మీ స్వార్థం వల్ల 95% మంది నష్టపోవాలా?

💥 అన్న క్యాంటీన్ వివాదంపై క్లారిటీ : అన్న క్యాంటీన్ వద్ద జరిగిన ప్రోటోకాల్ గొడవ కేవలం ఒక ఉద్యోగి అత్యోత్సాహం, బూతులు మాట్లాడటం వల్ల వచ్చిందే తప్ప పార్టీ పరమైనది కాదు.

💥 అండగా ఉండే నాయకుడు: అర్ధరాత్రి ఫోన్ చేసినా వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించి… తిరిగి మళ్ళీ ఫోన్ చేసి అడిగే ఇలాంటి పరిశీలకుడిని గతంలో ఎప్పుడైనా చూశామా? 24/7 కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, మంత్రులు, అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తున్న వ్యక్తిపై ఏడుస్తారా?

💥 ఎమ్మెల్యే గారి పేరు వాడుకుంటారా?: పరిశీలకుడికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక, మీ వ్యక్తిగత స్వార్థం కోసం గౌరవ ఎమ్మెల్యే గారి పేరు వాడుకోవటం మీ దిగజారుడు తనానికి నిదర్శనం. ఆ 95% మంది కలిసి సమావేశం పెట్టి వాస్తవాలు మాట్లాడితే మీరు తట్టుకోలేరు, గుర్తుంచుకోండి

💥 పిరికి మాస్టర్ మైండ్ ఎవరో మాకు తెలుసు: ఈ తప్పుడు పోస్టులు పెడుతున్న ఆ ఐదుగురు వ్యక్తుల వెనుక ఉన్న ఆ “పిరికి మాస్టర్ మైండ్” ఎవరో మాకు క్లియర్ గా తెలుసు. అతని చరిత్ర మొత్తం త్వరలోనే ఉతికి ఆరేస్తాం! జాగ్రత్త!

ఇట్లు,
తెలుగుదేశం పార్టీ,
అవనిగడ్డ నియోజకవర్గం.