భారత్ న్యూస్ విజయవాడ…అవనిగడ్డ:
కొడాలి, దింటిమెరక రామాలయాలు ధూప దీప నైవేద్య పథకానికి ఎంపికైనట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ ఆదాయంతో నడుస్తున్న ఆలయాల్లో ప్రతిరోజు ధూప దీప నైవేద్య కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించేందుకు ప్రభుత్వం దేవదాయ శాఖ ద్వారా ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఘంటసాల మండలం కొడాలి, కోడూరు మండలం దింటిమెరకలోని కోదండ రామాలయాలకు ఈ పథకం ద్వారా ప్రతి నెలా రూ.10వేలు చొప్పున ఆలయ అర్చకుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.
