భారత్ న్యూస్ వరంగల్ …వరంగల్: పోలీసు డ్రైవర్లకు సైతం ‘డ్రంకెన్ డ్రైవ్’ తనిఖీలు
ట్రాఫిక్ నిబంధనలు అందరికీ సమానమేనని చాటుతూ సీపీ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ వాహన డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మోటార్ ట్రాన్స్ పోర్ట్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ విభాగాలకు చెందిన డ్రైవర్లను బ్రీత్ అనలైజర్ల ద్వారా పరీక్షించారు. పోలీసులు సైతం నిబంధనలు కచ్చితంగా పాటించాలనే లక్ష్యంతో ఈ తనిఖీలు చేపట్టారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ తప్పకూడదన్నారు.
