కేరళ సీఎంగా వీడీ సతీశన్‌

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేరళ సీఎంగా వీడీ సతీశన్‌

కేరళ నూతన సీఎంగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. 11 రోజుల మథనం తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. సతీశన్‌ స్వస్థలం ఎర్నాకుళం జిల్లా నెట్టూరు. 2021-26 మధ్య విపక్ష నేతగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2001లో పరాపుర్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ విజయం సాధించింది.