AP: కుమార్తెకు తండ్రి ఆస్తిలో సమానహక్కు

భారత్ న్యూస్ అనంతపురం..AP: కుమార్తెకు తండ్రి ఆస్తిలో సమానహక్కు

హిందూ వారసత్వ సవరణ చట్టం–2005 ప్రకారం కుమార్తె పుట్టుకతోనే కుమారుడితో సమానంగా ఆస్తి హక్కు కలిగి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

కుమార్తె ఈ సమాన వాటా పొందేందుకు 2005లో సవరణ చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి జీవించి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఆస్తిలో సమాన హక్కు పొందేందుకు సవరణ చట్టం వచ్చిన 2005 సెప్టెంబర్ 9 నాటికి కుమార్తె జీవించి ఉంటే సరిపోతుందని చెప్పింది.