భారత్ న్యూస్ హైదరాబాద్…భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది.

అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాలతో గత కొంత కాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. గురు, శుక్ర వారాలలో జరిగిన కలెక్టర్స్ సదస్సుకు సైతం పవన్ హాజరు కాలేదు.