నేటి నుంచి నిరుపయోగంగా ఉన్న PNB అకౌంట్లు క్లోజ్

..భారత్ న్యూస్ హైదరాబాద్….నేటి నుంచి నిరుపయోగంగా ఉన్న PNB అకౌంట్లు క్లోజ్

పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. మూడేళ్లుగా వినియోగంలో లేని, జీరో బ్యాలెన్స్‌లో ఉన్న ఖాతాలను మూసివేయాలని నిర్ణయించింది. అలాగే ఈ-కేవైసీ పూర్తి చేయని ఖాతాలు కూడా క్లోజ్ చేయనుంది.

ఒకవేళ అకౌంట్ కొనసాగించాలనుకునే వారు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసి, కనీసం ఒక లావాదేవీ చేయాలి. అలాగే ఆధార్, పాన్ కార్డులతో సమీప బ్రాంచ్‌ను సంప్రదించాలని బ్యాంక్ సూచించింది.