భారత్ న్యూస్ ఖమ్మం…..2వ బెటాలియన్ టిజీఎస్పిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ బెటాలియన్ల సమగ్ర అభివృద్ధి, సిబ్బంది సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ లోని 2వ బెటాలియన్ టిజీఎస్పిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించి, వారికి మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు తెలిపారు.
