ఏపీలో కొత్తగా 96 కోర్టులు.. 1,730 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీలో కొత్తగా 96 కోర్టులు.. 1,730 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి :

ఏపీలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టులు 12, సివిల్ జడ్జి(సీనియర్) న్యాయస్థానాలు 25, సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులు 59 ఉన్నాయి. ఈ న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకాలకు 1,730 ఉద్యోగాలను మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులిచ్చారు.