తెలంగాణలో మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్

భారత్ న్యూస్ వరంగల్….. …తెలంగాణలో మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్

Apr 05, 2026,

తెలంగాణలో మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇప్పుడు కాస్త కష్టతరం అయ్యింది. రవాణాశాఖ కొత్త నిబంధనలు అమలు చేసింది. ఇప్పటివరకు LLR, డ్రైవింగ్ టెస్ట్ రెండు దశల్లో లభించేది. ఇప్పుడు LLR కోసం దరఖాస్తు చేసుకునే ముందు మరో ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్ష రాయాల్సి ఉంటుంది. మొత్తం 6 మాడ్యూల్స్, ఒక్కో మాడ్యూల్ 30 నిమిషాలు, మొత్తం 3 గంటలు పరీక్ష ఉంటుంది. ఇందులో ట్రాఫిక్ నిబంధనలు, వీడియో పాఠాలు ఉంటాయి. కెమెరా ఆన్ చేసి, గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్‌లలోనూ హాజరు కావాలి.