మర్యాదగా ఫ్లాట్ ఇవ్వండి.. లేదంటే హైడ్రా వస్తుంది

.భారత్ న్యూస్ హైదరాబాద్….మర్యాదగా ఫ్లాట్ ఇవ్వండి.. లేదంటే హైడ్రా వస్తుంది

హైడ్రా పేరుతో కబ్జాలకు దిగుతున్న బడాబాబులు

కూకట్ పల్లి – జేఎన్టీయూ పరిధిలోని గోపాల్ నగర్ ULC భూములపై కబ్జాదారుల కన్ను

20,30 సంవత్సరాల కింద తెలిసో, తెలియకో ULC భూముల్లో ప్లాట్లు కొని చిన్న చిన్న ఇల్లు నిర్మించుకున్న చిరుద్యోగులు, సామాన్యులు

దశాబ్దాలుగా కేసు నడుస్తుండగా, ఎట్టకేలకు ఇటీవల బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు

ఈ భూములపై కన్నేసి హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగిన బడాబాబులు

ఈ స్థలంలో అభివృద్ధి చేసి, హైరైజ్డ్ బిల్డింగులు నిర్మిస్తామని, అందులో ప్లాట్లు ఇస్తామని స్థల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్న కబ్జాదారులు

ఒప్పుకోకపోతే హైడ్రాను పంపించి ఇప్పుడున్న ఇండ్లు కూల్చేసి, ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టిస్తామని బెదిరింపులు

హైడ్రా పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ భూ రాబందులపై చర్యలు తీసుకోవాలని బాధితుల ఆవేదన