..భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ షాక్.. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న సీపీఎం….
తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య విచిత్ర పొత్తులు పొడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్తో జతకట్టిన లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు తలో దారి వెతుక్కుంటున్నాయి. రెండు పార్టీలు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో జత కడుతున్నాయి. సీపీఎం కొన్నిచోట్ల కాంగ్రెస్తో, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్తో జతకడుతోంది. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను బట్టి ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని సీపీఎం నిర్ణయించగా.. సీపీఐ మాత్రం కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు కోసం గట్టిగా పట్టుబడుతోంది…..
