కనీసం బండి సంజయ్‌కు పీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడు: సీఎం రేవంత్ రెడ్డి….

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…కనీసం బండి సంజయ్‌కు పీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడు: సీఎం రేవంత్ రెడ్డి….

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ముందు నిలబడి నిధులు అడిగే ధైర్యం బండి సంజయ్‌కు లేదని, కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడని ఆయన ఆరోపించారు. బండి సంజయ్‌కు మోదీ దగ్గర పరపతి ఉంటే, కాళేశ్వరంలో వేల కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్, హరీష్ రావులను, కారు దందాలో సంపాదించిన కేటీఆర్‌ను అరెస్ట్ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు…..