భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.మిర్యాలగూడలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ. 1138 కోట్ల చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ, బోనస్, ఉచిత విద్యుత్ పథకాల గురించి ప్రస్తావిస్తూ, దేశంలోనే రైతుల సంక్షేమానికి అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.