గరుడ ఆర్థిక సహాయం మొత్తం పెంచండి.

భారత్ న్యూస్ డిజిటల్:కడప:

గరుడ ఆర్థిక సహాయం మొత్తం పెంచండి

రాష్ట్రము లో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణ లకు జరిగే మేలు గరుడ పథకం అని దాని మొత్తం పెంచితే బ్రాహ్మణులకు మేలు జరుగుతుంది అని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు పీవీయెస్ వి ప్రసాదరావు. సూగురు రఘునాథ రావు లు ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.ఇటీవల బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత త్వరలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గరుడ పథకం అమలు చేస్తామని ప్రకటించడం హర్ష నీయమని అందుకు మంత్రి కి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. అయితే 2015లో అమలు చేసిన 10000రూపాయలు ఇస్తామని ప్రకటించరని ప్రస్తుత పరిస్థితి లో అది సరిపోదని అన్నారు. ఇప్పటికే పలుచోట్లబ్రాహ్మణ లు వారి కుటుంబ సభ్యులు చనిపోతే ఆర్థిక సహాయం చేయమని పలు బ్రాహ్మణ సంఘాలను కోరుతున్నారని అది వైసీపీ వారికీ విమర్శించడానికి అవకాశం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. బ్రాహ్మణ సంక్షేమo కోసం చంద్రబాబు నాయుడు కోర్పిరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులను ఆదుకొనే ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం హయాంలో బ్రా హ్మణులకు మేలు జరగ లేదని అన్నారు. 2015కు ఇప్పటికి ఖర్చులు విపరీతం గా పెరిగాయని అందువలన 10000రూపాయలకు బదులుగా 20000 రూపాయలు మంజూరు చేస్తే బ్రాహ్మణ లకు ఎంతో మేలు చేసిన వారు అవతారని మంత్రి ఈ విషయం లో త్వరిత గతిన నిర్ణయం చేయాలనీ విజ్ఞప్తి చేసారు. 2019 ఎన్నికలుసమయం లో అప్పటి చైర్మన్ ఆనంద సూర్య ఎన్నికల తర్వాత అధికారం లోకి వస్తే 15000 రూపాయలు గరుడ పథకం కింద ఇస్తామని ప్రకటించరని గుర్తు చేసారు. 5 సంవత్సరాలనలో తర్వాత గరుడ పథకం అమలు కు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్ లు ఈ విషయం పై. ప్రభుత్వందృష్టికి తీసుకొని పోవా లని. కోరారు.