భారత్ న్యూస్ రాజమండ్రి…విజయవాడ
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

Ammiraju Udaya Shankar.sharma News Editorలేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరుపున కూటమి పార్టీల నిర్లక్ష్యాన్ని ఎండగడతామని హెచ్చరిస్తున్నాం.
కరువు పనిపై కేంద్రం కుట్రలు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కిమ్మనకుండా ఉండటం దారుణం.
బీజేపీ చేస్తున్న నల్ల చట్టాలకు చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటు.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఊతం ఇచ్చిందే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం.
YSR ముఖ్యమంత్రిగా అనాడు దేశంలోనే తొలి ఉపాధి జాబ్ కార్డ్ అందింది రాష్ట్రంలోనే.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పనికి ఆహార పథకంతో రాష్ట్రంలో ఏటా 80 లక్షల మంది పేదలకు ఉపాధి హక్కుగా మారింది.
దేశంలోనే ఉపాధి హామీ పథకాన్ని వాడుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిసి,
జీ రామ్ జీ పేరుతో తెచ్చిన అక్రమ చట్టంతో రాష్ట్రానికి ఏటా 4500 కోట్ల భారం అని తెలిసి,
ఆర్థికంగా నిధులు సమకూర్చడం కష్టమని తెలిసి,
గోరుచుట్టుపై రోకలి పోటులా కొత్త చట్టం మారిందని తెలిసి,
ప్రశ్నించకుండా బాబు గారు మౌనం వహించడం బాధాకరం.
ప్రతి నెలా జీతాలు ఇవ్వడానికే అప్పులు చేసే మీరు..
జీ రామ్ జీ పథకానికి ఏటా 40 శాతం నిధులు ఎక్కడ నుంచి తెస్తారు ?
నిరుద్యోగంలో నెంబర్ 1 గా ఉన్న రాష్ట్రంలో ఉపాధికి ఉరి పెడుతుంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ?
కొత్త చట్టాలతో పనికి పాతరేస్తుంటే అడ్డుకొనే బాధ్యత మీకు లేదా ?
మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రినా లేక మోడీ గారి చేతిలో తోలుబొమ్మనా ?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి పార్టీలను డిమాండ్ చేస్తున్నాం.
నరేగా చట్టాన్ని తిరిగి పునరుద్ధరించేలా భేషరతుగా మద్దతు పలకండి.
ఉపాధి హామీ పథకానికి ఊపిరి తీసిన జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయండి.
మోడీ గారి రామ్ జీ చట్టం రాష్ట్రానికే ప్రమాదం.

వెంటనే కేంద్రంపై ఒత్తిడి తీసుకు రండి.