భారత్ న్యూస్ గుంటూరు….పల్నాడు జిల్లాలో అక్రమ రేషన్ మాఫియా జోరు

Ammiraju Udaya Shankar.sharma News Editor…పిడుగురాళ్ల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా..??
పల్నాడు జిల్లా లో అక్రమ రేషన్ బియ్యం మాఫియా యధేఛగా కొనసాగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది…?
ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ఈ అక్రమ దందా జోరుగా సాగుతున్నప్పటికీ, దాన్ని అరికట్టే అధికార యంత్రాంగం కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
గురజాల నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసినా, అవన్నీ సాయంత్రానికి పిడుగురాళ్ల పట్టణంలోని ఒక రైస్ మిల్లుకు చేరాల్సిందే అన్నట్లుగా పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారం వెనుక ఓ పార్టీ నాయకుడి అండదండలు ఉన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి.?
కూటమి ప్రభుత్వం ఎంతో విశ్వసనీయత, విధేయత చూపుతు వ్యవహరిస్తుంది,
కానీ నీరు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు దళారులు చీకటి ఒప్పందాలు చేసుకొని సామాన్యుడికి సైతం చుక్కలు చూపిస్తున్నారు,
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపి, అక్రమ దందాకు చెక్ పెట్టాలని పిడుగురాళ్ల పట్టణ ప్రజలు పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు,
లైమ్ సిటీగా పిలవబడే పిడుగురాళ్ళను నేడు రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…??
అధికార పార్టీ పేరు అడ్డం పెట్టుకొని, కొందరు నేతలు, అధికారులను కళ్ళు కప్పి రేషన్ వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.??
నెలనెలా సంబంధిత అధికారులకు మామూలు చేరుతుండటంతో పిడుగురాళ్ల వైపు ఏ ఒక్క అధికారి కూడా కన్నెత్తి చూడటానికి సాహసం చేయడం లేదని స్థానికుల వాపోతున్నారు.

అక్రమ రేషన్ మాఫియాపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.