కదిలే కారులో ఐటీ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్…రాజస్థాన్‌లో దారుణం.

భారత్ న్యూస్ ఢిల్లీ…..రాజస్థాన్‌లో దారుణం

కదిలే కారులో ఐటీ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్

దుర్మార్గానికి కారకులైన సీఈవో, మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త

రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ ప్రాంతంలో తన పుట్టినరోజు మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఒక హోటల్లో విందు ఏర్పాటు చేసిన జేకేఎం అనే ఐటీ సంస్థ సీఈఓ జితేష్ సిసోడియా

అర్ధరాత్రి 1:30 గంటలకు పార్టీ ముగిసాక, మత్తులో ఉన్న మహిళా ఉద్యోగిని ఇంటి దగ్గర దిగబెడతామని కారులో ఎక్కించుకున్న సీఈవో

కారులో మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ శిల్పా సిరోహి కూడా ఉండడంతో ధైర్యంగా కారు ఎక్కిన సదరు ఉద్యోగిని

మార్గమధ్యంలో కారు ఆపి స్మోకింగ్ చేసే పదార్థాలను కొనుగోలు చేసి మహిళా ఉద్యోగినికి కూడా పొగ తాగించగా, పూర్తిగా మత్తులోకి జారుకున్న బాధితురాలు

ఈ క్రమంలో సీఈఓ జితేష్, మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త గౌరవ్ కదిలే కారులో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడగా, స్పృహాలోకి వచ్చి తనపై లైంగిక దాడి జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

కేసు నమోదు చేసి, కారు వెబ్ క్యామ్‌లో రికార్డయిన దృశ్యాల మేరకు దాడి జరిగిందని నిర్ధారించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు