భారత్ న్యూస్ విజయవాడ… :
తోటి సిబ్బందికి ఆరోగ్యం బాగలేకపోతే మేమున్నాం అంటూ ముందుకు వచ్చిన కంకిపాడు పోలీసులు, కంకిపాడు CI J. మురళి కృష్ణ గారి చేతులమీదుగా సహాయం అందజేత..
కృష్ణాజిల్లా, కంకిపాడు పోలీస్ స్టేషన్ లో హోమ్ గార్డ్ గా పనిచేయుచున్న J.Ramu కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, అతని కాలుకి ఆపరేషన్ చేసి వెళ్ళు తొలగించారని తెలిసి, తోటి సిబ్బంది కష్టంలో తోడుగా ఉండాలి అనే సహృదయంతో స్పందించి అతని ఆరోగ్య అవసరాల నిమిత్తం కొంత ఆర్థిక మొత్తాన్ని సహాయం చేసిన కంకిపాడు పోలీసులు…
సదరు నగదుని కంకిపాడు CI Murali krishna చేతుల మీదగా హోమ్ గార్డ్ రాముకి అందజేసినారు.

కంకిపాడు SI Sandeep , అదనపు SI Thathacharyulu మరియు సిబ్బందిని CI గారు ప్రత్యేకంగా అభినందించారు.