.భారత్ న్యూస్ హైదరాబాద్….36 మంది మృతి.. 279 మంది గల్లంతు
హాంకాంగ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోగా, 279 మంది ఆచూకీ తెలియడం లేదని ముఖ్య పరిపాలనాధికారి జాన్ లీ వెల్లడించారు.
29 మందిని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. 32 అంతస్తులు ఉన్న 8 భవంతులు మంటల్లో కాలిపోతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాదాపు 900 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు.
భవన సముదాయంలో 2 వేల ఇళ్లు ఉండగా, 4,800 మంది నివసిస్తున్నారని తెలిసింది
