భారత్ న్యూస్ అనంతపురం…నేపాల్లో రాజకీయ నాయకుల అవినీతిపై జెన్ జెడ్ యువత ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రభుత్వమే కూలిపోయింది. దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ జెన్ జెడ్ ఉద్యమం మెక్సికోకు వ్యాపించింది.
ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. తాజాగా అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

దీంతో పోలీసులు, నిరసనకారల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. అందులో ఎక్కువమంది పోలీసులు ఉండటం గమనార్హం.