దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

భారత్ న్యూస్ గుంటూరు.దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈ నెల 25 వరకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని అందజేస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు.

ఈ నెల 25 లోపు www.apdas-cac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.’డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, రెగ్యులర్ డిగ్రీ, ఆపై ఉన్నతవిద్య చదువుతున్న విద్యా ర్థులు, పదో తరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధితో జీవించేవారు, 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉండి 70 శాతం అంగవైకల్యం ఉన్న వారు దరఖాస్తు చేసు కొనేందుకు అర్హులు” అని మంత్రి స్వామి వెల్లడించారు.