ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
భారత్ డిజిటల్ న్యూస్ రిపోర్టర్: బొక్కా నాగేశ్వరరావు (ఆగస్టు 26 2025)
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గండేపల్లి గ్రామాలలో కూటమి నాయకులు.. సచివాలయ సిబ్బందితో కలిసి, స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన పరిటాల రాము( కీసర ) మాజీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ బొక్కా దేవానందం ( గండేపల్లి)
ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులు,అధునాతన ఈ ఫోర్స్ యంత్రాలు,ఆన్లైన్ డాష్ బోర్డులలో స్టాక్ ప్రదర్శన, యాప్ లో సమగ్ర పర్యవేక్షణ, తదితర నూతన టెక్నాలజీతో అధునాతనంగా ఈ కార్డులను తయారు చేశారన్నారు, రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసే వాళ్లకు అడ్డుకట్టు పడుతుందని, పేదలకు సులువుగా సరుకులు పంపిణీ చేయడం కోసం, కూటమి ప్రభుత్వం తీస్తున్న సరికొత్త విధానాలవల్ల పేదలు ఇబ్బంది పడకుండా మేలు జరుగుతుందని, ఏటీఎం కార్డు తరహాలో అదనాతన స్మార్ట్రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25 నుంచి కార్డుదారులందరికీ జారీ చేయడం జరుగుతుందని, క్యూఆర్ కోడ్ ఇతర సాంకేతికత అంశాలతో ఈ కార్డులను తయారు చేసి నందుకు
పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదేండ్ల మనోహర్ కి, చంద్రబాబు నాయుడు కి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ బాబు కి, మరియు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కకి, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి రవికుమార్ కీసర టిడిపి నాయకులు కుక్కల శ్రీను నండ్రు దాసు( కీసర)సర్పంచ్ పేరమ్మ ఆశా వర్కర్లు
సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.
