భారత్ న్యూస్ విశాఖపట్నం..గుజరాత్ టైటాన్స్ ఇంటికి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్, 2025 సీజన్‌లో శుక్రవారం రాత్రి హోరాహోరీగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 20 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ కీలక పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచు కున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ పోరాడి నప్పటికీ, 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేయ గలిగింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (1) త్వరగా ఔటయ్యా డు. అయితే, సాయి సుదర్శన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
అతను 49 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 80 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. కుశాల్ మెండిస్ (10 బంతుల్లో 20, 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడినా ఎక్కు వసేపు క్రీజులో నిలవలేక హిట్ వికెట్‌గా వెనుదిరి గాడు. వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 48 పరుగులు, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విజయానికి చేరువ చేసే ప్రయత్నం చేశాడు.
షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (15 బంతుల్లో 24, 4 ఫోర్లు) కూడా ఫర్వాలేదనిపిం చాడు. చివర్లో రాహుల్ తెవాటియా (11 బంతుల్లో 16 నాటౌట్), షారుఖ్ ఖాన్ (7 బంతుల్లో 13) ప్రయత్నించినా, ముంబై బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు వారి పోరాటం సరిపోలేదు.
ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు కీలక వికెట్లు పడగొట్టగా, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్, మిచెల్ శాంట్నర్, అశ్వని కుమార్ తలా ఒక వికెట్ తీసి జట్టు విజయంలో పాలుపంచుకున్నారు. బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీయడం విశేషం.

ఈ విజయంతో ముంబై ఇండియన్స్ టోర్నమెంట్‌లో ముందంజ వేయగా, గుజరాత్ టైటాన్స్ ప్రస్థానం ముగిసింది. ఇక, జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్… పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తో ఢీకొట్టనుంది.