ఏపీలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ

భారత్ న్యూస్ అమరావతి..ఏపీలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ

Ammiraju Udaya Shankar.sharma News Editor…2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు చేసేలా తీసుకువస్తున్న ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని విజ్ఞప్తి

మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని బలపరుద్దామన్న చంద్రబాబు

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని వెల్లడి

‘నారీ శక్తి వందన్ అధినియం’ మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదపడుతుందన్న చంద్రబాబు

ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందన్న సీఎం