భారత్ న్యూస్ కరీంనగర్ …..ఆధార్ కార్డు ఉంటే రూ.3 లక్షల లోన్.. క్లారిటీ!
ప్రభుత్వం ఉచితంగా లోన్లు ఇస్తుందని, ఆధార్ వివరాలు ఇస్తే రూ.3 లక్షల వరకు లోన్ ఇస్తామని యూట్యూబ్‌లో వస్తున్న ప్రకటనలు పూర్తిగా నకిలీవని కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది. “ప్రధానమంత్రి లోన్ స్కీమ్” పేరుతో వస్తున్న ఈ ఆఫర్లను నమ్మవద్దని హెచ్చరించింది. ఈ నకిలీ ప్రకటనలలోని లింక్‌లను క్లిక్ చేస్తే, మోసగాళ్లు ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో డబ్బులు తీసుకుని, ఆధార్, ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి, OTP ద్వారా ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత వివరాలను ఎవరికీ పంచుకోవద్దని సూచించింది.
