భారత్ న్యూస్ శ్రీకాకుళం….సీనియర్ పాత్రికేయులు రామకృష్ణను పరామర్శించిన ఎమ్మెల్యే మండలి
- ఇంటికి వెళ్లి రామకృష్ణ ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్న బుద్ధ ప్రసాద్
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆపరేషన్ అనంతరం ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న కోడూరు సీనియర్ పాత్రికేయులు, సాక్షి రిపోర్టర్ చిట్టిప్రోలు వెంకట రామకృష్ణను అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ బుధవారం పరామర్శించారు. యార్రారెడ్డివారిపాలెంలోని రామకృష్ణ నివాస గృహానికి వెళ్లి ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో కుడి కాలుకు, తలకు బలమైన గాయాలైనట్లు రామకృష్ణ ఎమ్మెల్యేకు వివరించారు.

రెండుసార్లు విజయవాడలో ఆపరేషన్ చేసినా సక్సెస్ కాకపోవడంతో హైదరాబాదులో మరల ఆపరేషన్ చేయించుకుని ప్రస్తుతం ఇంటికి చేరినట్లు తెలిపారు. ఆపరేషన్ కి సంబంధించిన ఎక్సరేలను బుద్ధ ప్రసాద్ పరిశీలించారు. రామకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.