భారత్ న్యూస్ కరీంనగర్ …..నేటి నుంచి వీబీ-జీరామ్ జీ పథకం అమలు
గ్రామీణ కార్మికులకు ఉపాధి, మెరుగైన ఆదాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ (VB-GRAMJEE) పథకాన్ని బుధవారం దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది.
ఈ పథకం కింద రోజువారీ వేతనాన్ని రూ.300కు పెంచుతూ, ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు.
దేశవ్యాప్తంగా సగటు రోజువారీ వేతనం రూ.299 నుంచి రూ.327కు పెరిగింది. తక్కువ వేతనాలున్న యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో 15-25% వరకు వేతనాలు పెరిగాయి.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.