తెలంగాణలో రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం….

భారత్ న్యూస్ వరంగల్ …తెలంగాణలో రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం….

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల హైవే (ఎన్‌హెచ్‌ 63)ను హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో, జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 563)ను బీవోటీ పద్ధతిలో విస్తరించనున్నారు.

రూ.7,597 కోట్లతో 190 కిలోమీటర్ల మేర ఈ రహదారులను 4 వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కోసం రూ.39,290 కోట్ల పెట్టుబడికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది…..