భారత్ న్యూస్ రాజమండ్రి…తాడేపల్లి (27.05.2026, బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరు అయ్యారు
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు . అలాగే చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు శ్రీ వైయస్ జగన్ దిశానిర్దేశం చేసారు .

పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరిగింది…