భారత్ న్యూస్ అనంతపురం..ఉద్యోగం పోయిందని స్నేహితులు దొంగలుగా మారారు…!!
నెల్లూరు జిల్లాకు చెందిన శీలం నాగార్జునరెడ్డి (తూర్పు ఎర్రబల్లి), వెంకట మురళి (నల్లగొండ), విష్ణువర్ధన్ రెడ్డి(స్టోన్హెస్ పేట) క్లోజ్ ఫ్రెండ్స్.
ఉన్నత చదువులు చదివిన వీరంతా బెట్టింగ్‌కు బానిసలయ్యారు. ఉద్యోగాలు పోవడంతో దొంగలుగా మారారు. తిరుపతి, నెల్లూరులో 9 చైన్‌స్నాచింగ్‌లు చేశారు.వీరిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 2 బైకులు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు…
