స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయొద్దు : గుండుకొట్టించుకొని కార్మికుల నిరసన

భారత్ న్యూస్ విశాఖపట్నం..స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయొద్దు : గుండుకొట్టించుకొని కార్మికుల నిరసన
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయకూడదని … కాంటాక్ట్‌ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ …. విశాఖ జిల్లా జగదాంబ జంక్షన్‌ దగ్గర అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ కాంటాక్ట్‌ కార్మికుల తొలగింపును ఆపాలన్నారు. కార్మికుల, నాయకుల సస్పెన్షన్లు, షోకాజ్‌ నోటీసులు, వార్నింగ్‌ లెటర్లను రద్దు చేయాలన్నారు. స్టీల్‌ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎం.సుబ్బారావు, పి.మణి, వై.రాజు, డివైఎఫ్‌ఐ నాయకులు బిఎస్‌ఎన్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు. పలువురు నేతలు గుండు కొట్టించుకొని తమ నిరసనను వ్యక్తపరిచారు.