భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor… రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరుబాట
ఏపీలో వైస్సార్సీపీ తమ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యం లో ఈ నెల 23న పోరుబాట నిర్వహిస్తున్నట్లు వైస్సార్సీపీ అధిష్టానం వెల్లడించింది.
నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్ పై నిరసన గళం వినిపించాలని పిలుపును ఇచ్చింది.

నిరుద్యోగులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా చేసి డిమాండ్లతో వినతిపత్రం ఇస్తామని తెలిపింది.
అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ.3,000 భృతి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేసింది.