భారత్ న్యూస్ శ్రీకాకుళం…..”నిన్ను భాగస్వామిగా పొందడం నా అదృష్టం”.. భువనేశ్వరికి సీఎం చంద్రబాబు ఎమోషనల్ బర్త్ డే విషెస్..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజును పురస్కరించుకుని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగ శుభాకాంక్షలు తెలిపారు. “నీ ప్రేమ, శక్తి మన కుటుంబానికి పునాది. ఒడిదుడుకుల్లో నా పక్కనే ఉన్నావు.. నిన్ను భాగస్వామిగా పొందడం నా అదృష్టం” అని చంద్రబాబు పేర్కొన్నారు.
