భారత్ న్యూస్ వరంగల్ …తెలంగాణ పీజీఈసెట్ పరీక్షలు 29 నుంచి ప్రారంభం…..
తెలంగాణ : తెలంగాణలో ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు మే 29 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి.
ఈ పరీక్షలు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొత్తం 19 సబ్జెక్టులకు 26,085 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.

హైదరాబాద్లో 24, వరంగల్లో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వర్రావు ఈ వివరాలు వెల్లడించారు…..