భారత్ న్యూస్ తిరుపతి…ఈశ్వరుడే వీణాధర దక్షిణామూర్తి…!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
ఓంకార నాదంగా , వీణను ధరించిన రూపంలో దర్శనమిచ్చే
ఈశ్వరుడే వీణాధర దక్షిణామూర్తి.
🌸ఈ ఈశ్వరుడు మీటే వీణా నాదము సమస్త జీవులకు ఆత్మజ్ఞానం అనుగ్రహిస్తున్నది. ఈయననే ‘ గాన దక్షిణా మూర్తి ‘ అని ఉత్తరకామిక ఆగమ శాస్త్రం తెలియ చేస్తోంది.
ఈ దక్షిణామూర్తి యొక్క చతుర్భుజాలలో ముందు వున్న రెండు హస్తాలతో వీణను మీటుతుండగా వెనుక హస్తాలలో , అక్షయమాల, జ్వాల కలిగిన ప్రమిద వున్నవి.
ఈయన ఎడమ కాలు, ‘
‘ఉత్కుటికాసనంగా’ అమరివుంటుంది.

🌸శుకుడు ,నారదుడు, గంధర్వులు, కిన్నెరలు భూతగణాలు , సకల జీవరాశులు ఈయన చుట్టూ పరివేష్టించి వుంటాయి.
ఈ స్వామి నిలబడి గాని ఆశీనుడై గాని, మునులు పరివేష్టించి వుండగాకాని ,
ముయలకుని మీద కాలు వేసి వున్నట్లుగాని , లేనట్టు గాని , మఱ్ఱిచెట్టు క్రింద కాని, మఱ్ఱి చెట్టు లేకుండా కాని దర్శనమనుగ్రహిస్తూ వుంటారు.
తిరుమరైక్కాడు
( వేదారణ్యం, నాగలాపురం ,
తిరుప్పాట్రురై ,