..భారత్ న్యూస్ హైదరాబాద్….నిద్రలో కనేది కల.
నిద్రపోతున్న సమాజాన్ని…
మేల్కొలిపేది కళ.
ఆ కళకు ప్రాణంపోసే సినీ పరిశ్రమను…
గుర్తించి, గౌరవించే సాంప్రదాయాన్ని…
ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.
తెలంగాణ చైతన్యానికి ప్రతీక…
తన గళంతో జనంలో…
స్ఫూర్తిని నింపిన పతాక…
గద్దరన్న స్మృతిలో…
రాష్ట్ర ప్రభుత్వం తరపున…
“తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్”ను
ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది.

తెలంగాణ రైజింగ్ – 2047
ప్రణాళికలో సినీ పరిశ్రమకు
ఒక చాప్టర్ ఉండాలన్నది నా ఆకాంక్ష.
మన రాష్ట్రం 2047 నాటికి
మూడు ట్రిలియన్ డాలర్ల
ఎకానమీగా ఎదగాలి.
అందులో సినీ పరిశ్రమ వాటా ఉండాలి.
ఆ స్థాయికి పరిశ్రమ ఎదగడానికి
ప్రజా ప్రభుత్వం నుండి అవసరమైన
సంపూర్ణ సహకారం అందిస్తాం.
హైటెక్స్ వేదికగా…
అంగరంగ వైభవంగా జరిగిన…
ఈ వేడుకల్లో గడచిన 10 ఏండ్ల
సినిమాలకు అవార్డులు అందుకున్న…
ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక …
అభినందనలు.
సీఎం రేవంత్ రెడ్డి