…భారత్ న్యూస్ హైదరాబాద్….భారీ వర్షాలు.. మ్యాన్‌హోల్స్ ఉంటాయి జాగ్రత్త …
హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రోడ్డుపై నడిచేవారు, బైకులు నడిపేవారు మ్యాన్‌హోల్స్, డ్రైనేజీలను గమనిస్తూ ఉండాలి. కొన్ని మ్యాన్‌హోల్స్‌పై మూతలు లేకపోవడంతో అందులో పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా వర్షం కారణంగా నీరు నిలిచి ఉన్న ప్రదేశాల్లో మ్యాన్‌హోల్స్ కనిపించకపోవచ్చు. కాబట్టి మరింత జాగ్రత్త అవసరం…..
