అల్లుడిపై దాడి చేసిన మామ

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….అల్లుడిపై దాడి చేసిన మామ
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. విడాకులు తీసుకున్న భార్యను తిరిగి అంగీకరించాలని డిమాండ్ చేస్తూ అల్లుడిపై మామ, అతని సహచరులు కర్రలు, కత్తులతో దాడి చేశారు. అడ్డువచ్చిన అల్లుడి తల్లిని కూడా కత్తులతో పొడిచి చంపారు. తీవ్రంగా గాయపడిన అల్లుడిని ఆసుపత్రికి తరలించారు. హత్య చేసిన నిందితులు పోలీసులకు లొంగిపోయారు. గ్రామస్తులు కావాలనే పక్కా ప్లాన్‌తో హత్య చేశారని ఆరోపిస్తున్నారు.