తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

భారత్ న్యూస్ డిజిటల్;హైదరాబాద్,:

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

“భోగి, మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
భోగభాగ్యాలతో సిరి సంపదలతో ప్రజలందరూ ఆనందంగా, సుఖంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ భోగి, సంక్రాంతి ప్రజల జీవితాల్లో నూతన కాంతులు తీసుకురావాలని,ఆనందోత్సాహాల నడుమ భోగి, సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
సంక్రాంతి సందర్భంగా ప్రజలతోపాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.