భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మీదుగా రైలు
రైలు వెయ్యాలని జులైలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ నేపథ్యంలో దీని ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతివ్వాలని కోరుతూ రైల్వే బోర్డుకు దక్షిణమధ్య రైల్వే లేఖ
రూ.2,520 కోట్లతో కల్వకుర్తి నుంచి కొండారెడ్డిపల్లి మీదుగా ఏపీలోని మాచర్ల వరకు రైలు
తెలుగు రాష్ట్రాల మధ్య నూతన మార్గంలో రైల్వే అనుసంధానత కోసం ప్రతిపాదిత కల్వకుర్తి – మాచర్ల ప్రాజెక్టుకు సంబంధించి వేగవంతం చేయడానికి చర్యలు
తొలుత ఈ ప్రాజెక్టు దూరం 100 కి.మీ. అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు కాగా.. తాజా ఎలైన్ మెంట్తో దూరం 126 కి. మీ. కి, అంచనా రూ.2,520 కోట్లకు పెరిగిన వ్యయం….
