.కూతురిని చంపిన తల్లికి, సహకరించిన ప్రియుడికి జీవిత ఖైదు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కూతురిని చంపిన తల్లికి, సహకరించిన ప్రియుడికి జీవిత ఖైదు

కూతురిని చంపిన తల్లికి, సహకరించిన ప్రియుడికి జీవిత ఖైదు
తెలంగాణ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల కూతురిని అతి కిరాతకంగా హతమార్చిన తల్లి సయ్యద్‌ హజీరా బేగం, సహకరించిన ఆమె ప్రియుడు సయ్యద్‌ యూసఫ్‌లకు వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయస్థానం సోమవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. చిన్నారితోపాటు ఈ జంట హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు వచ్చింది. అయితే వీరి బంధానికి చిన్నారి అడ్డుగా ఉందనే కారణంతో 2022 ఏప్రిల్‌ 23న బాలికను సయ్యద్‌ నేలకు కొట్టగా, ఆపై తల్లి గొంతు నులిమి హత్య చేసింది. తాజాగా నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది.