రేపటి నుంచి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రేపటి నుంచి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
తెలంగాణ : పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారారనే ఫిర్యాదులపై రేపటి నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిరిగి విచారణ ప్రారంభించనున్నారు. ప్రకాశ్ గౌడ్‌పై కల్వకుంట్ల సంజయ్, కాలే యాదయ్యపై చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్ రెడ్డిపై చింతా ప్రభాకర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయగా.. ఇరుపక్షాల వాదనలను శుక్రవారం నిర్వహించనున్నారు. 25 నుంచి 31లోగా మిగిలిన ఎమ్మెల్యేలపై విచారణను పూర్తి చేయనున్నారు.