భారత్ న్యూస్ రాజమండ్రిAmmiraju Udaya Shankar.sharma News Editor…….ఇక సర్కార్ బడులన్నింట్లో ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
అమరావతి
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అన్నింటికీ ఇక కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్ సదుపాయం రానుంది. ఈ మేరకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. తాజాగా పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై మంత్రి లోకేషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను పునర్ వ్యవస్థీకరించి, నిపుణులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే బోర్డు మీటింగ్ నిర్వహించి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్టెమ్ కార్యకలాపాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అలాగే నైపుణ్య పోర్టల్‌ను సెప్టెంబరు ఒకటి నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకోష్ అన్నారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి పోస్టును జిల్లా ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి అధికారిగా మార్చాలన్నారు. వీరి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పారు. అల
