జర్నలిస్టుల సొంతింటి కోసం దీక్ష

.భారత్ న్యూస్ హైదరాబాద్….జర్నలిస్టుల సొంతింటి కోసం దీక్ష

P.Raja..AP. Bero Chief

  • నిజాంపేటలో హసన్ షరీఫ్ నిరసన

సహనం వందే, హైదరాబాద్:
పేద జర్నలిస్టులకు సొంతింటి కలను సాకారం చేయాలని కోరుతూ జేఎన్‌జేహెచ్‌ఎస్‌ సభ్యుడు హసన్ షరీఫ్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ దీక్ష కొనసాగుతోంది. తొలి రోజు మారేపల్లి లక్ష్మణ్ నేత, మంజుల రెడ్డి, భరద్వాజ్, ఆర్టిస్ట్ వాసు (శ్రీనివాస రావు) దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రెండో రోజు నిర్మలా రెడ్డి, భవాని, ఇంద్రవెళ్లి రమేష్‌లు హసన్ షరీఫ్‌కు మద్దతుగా నిజాంపేటలో రిలే దీక్షలో కూర్చున్నారు. ఈ పోరాట స్ఫూర్తితో జర్నలిస్టులందరూ ఏకమై తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సంఘం సభ్యులు పిలుపునిచ్చారు.