.భారత్ న్యూస్ హైదరాబాద్….త్వరలో సామాన్యులకు అందుబాటులోకి రానున్న నిత్యవసర సరుకుల ధరలు!
హైదరాబాద్:దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్‌న్యూస్. చిన్నచిన్న ఉద్యోగాలు, పనులు చేసుకుంటూ నెలవారీ ఖర్చులు భారం అవుతున్నాయని భావించే వారికి ఇకనుంచి కాస్త ఉపశమనం లభించనుంది. జీఎస్టీ తగ్గింపు ప్రయోజ నాన్ని వినియోగదారులకు బదలాయిస్తూ ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల పై కొత్త రేట్లను తగ్గించాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఉపయో గించే పలు రకాల వస్తువుల చౌక ధరలకు అందుబాటు లోకి రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా శ్లాబుల్లో మార్పులు చేసింది. కేవలం 5శాతం, 18శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. దీంతో జీఎస్టీ రేట్ల కోతకు అనుగుణంగా ఈనెల 22 నుంచి తమ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. వీటిలో షాంపూలు, సబ్బులు, టూట్ పేస్టులు, టూత్ బ్రష్ లు, రేజర్లు, బేబీ డైపర్లు తదితర ఉత్పత్తులకు సంబంధించి రేట్లు భారీగా తగ్గనున్నాయి.
జీఎస్టీ రేట్లు సవరించిన నేపథ్యంలో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్ హిందుస్థాన్ యూనిలీవర్ తమ ఉత్పత్తుల ధరలను తగ్గించింది.

డోవ్ షాంపూ (340మి.లీ.) ధర రూ.490 ను